Weekend Release - ఈవారం సినిమాలు

Wednesday,February 17,2021 - 03:58 by Z_CLU

ఉప్పెన హంగామా కొనసాగుతూనే ఉంది. అంతలోనే మరో వీకెండ్ వచ్చేసింది. ఈ వారాంతం 4 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. ఈ సినిమాలన్నీ వేటికవే ప్రత్యేకమైనవి. హేవే లుక్..

గత నెల బంగారు బుల్లోడుగా థియేటర్లలోకి వచ్చిన అల్లరినరేష్, ఈనెల నాంది సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. అల్లరోడు నటించాడు కాబట్టి ఇందులో కామెడీ ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేయొద్దు. ఫుల్ లెంగ్త్ సీరియస్ మూవీ ఇది. అండర్ ట్రయల్ ఖైదీగా జైలు జీవితం గడిపే ఓ సగటు వ్యక్తి కథ ఇది. నవమి హీరోయిన్ గా పరిచయమౌతున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది. హరీష్ శంకర్ శిష్యుడు విజయ్ కనకమేడల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.

నాందికి పోటీగా వస్తున్న సినిమా కపటధారి. సుమంత్-నందిత శ్వేత హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను ధనుంజయన్ నిర్మించాడు. కన్నడలో సూపర్ హిట్టయిన సినిమాకు రీమేక్ గా వస్తుండడంతో కపటధారిపై అంచనాలు బాగున్నాయి. ట్రయిలర్ హిట్టవ్వడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. ప్రదీప్ కృష్ణమూర్తి డైరక్ట్ చేసిన ఈ సినిమాలో హీరోయిన్ పూజా కుమార్ ఓ గెస్ట్ రోల్ పోషించింది.

విశాల్, శ్రద్ధా శ్రీనాధ్, రెజీనా హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా చక్ర. ఆన్ లైన్ మోసాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఆనందన్ దర్శకుడు. ఈ సినిమాపై విశాల్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. తన కెరీర్ లో ఇదొక బ్లాక్ బస్టర్ అవుతుందని చెబుతున్నాడు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించాడు.

కన్నడ స్టార్ ధృవ సర్జా హీరోగా నటించిన సినిమా పొగరు. కన్నడలో హిట్టయిన ఈ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేశారు. రష్మిక హీరోయిన్ గా నటించింది. సాయిసూర్య ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ప్రతాప్ రాజు నిర్మించిన ఈ సినిమా.. పాటలతో ప్రేక్షకుల్ని బాగానే ఎట్రాక్ట్ చేసింది.