వీకెండ్ రిలీజ్

Wednesday,February 05,2020 - 03:22 by Z_CLU

సంక్రాంతి సినిమాల జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే థియేటర్లలోకి అశ్వథ్థామ వచ్చేసింది. ఇప్పుడు జాను కూడా రాబోతోంది. ఈ వీకెండ్ జానుతో పాటు మరో 4 సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి.

తమిళ్ లో కల్ట్ మూవీగా పేరుతెచ్చుకున్న 96 సినిమాకు తెలుగు రీమేక్ జాను. తమిళ్ లో విజయ్ సేతుపతి-త్రిష నటిస్తే.. తెలుగులో శర్వానంద్-సమంత ఆ పాత్రలు పోషించారు. మిగతా టెక్నికల్ టీమ్ అంతా సేమ్ టు సేమ్. తమిళ్ లో సినిమా తీసిన ప్రేమ్ కుమార్, ఒరిజినల్ మూవీకి మ్యూజిక్ ఇచ్చిన గోవింద్ వసంత్.. తెలుగుకు కూడా
పనిచేశారు. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాత.

ఎమోషనల్ కంటెంట్ తో జాను వస్తుంటే.. దీనికి రివర్స్ లో కంప్లీట్ కామెడీ కంటెంట్ తో వస్తోంది 3-మంకీస్. అనీల్ కుమార్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో సుడిగాలి సుధీర్, గెటప్ శీను, రామ్ ప్రసాద్ హీరోలు. కారుణ్యచౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీతో పాటు నందు-ప్రియాంక శర్మ జంటగా నటించిన సవారీ థియేటర్లలోకి వస్తోంది. యానిమల్ లవ్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమాకు సాహిత్ దర్శకుడు.

జాను, త్రీ మంకీస్, సవారీ తో పాటు.. డిగ్రీకాలేజ్, స్టాలిన్ అనే మరో 2 మూవీస్ థియేటర్లలోకి వస్తున్నాయి. అవార్డ్ విన్నింగ్ డైరక్టర్ నరసింహ నంది డిగ్రీకాలేజ్ ను డైరక్ట్ చేశాడు. ఓ బలమైన సందేశానికి రొమాంటిక్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమా తీశాడు. ఇక జీవా నటించిన సీర్ సినిమా తెలుగులో స్టాలిన్ గా వస్తోంది. రియా సుమన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నవదీప్ విలన్ గా కనిపిస్తాడు