వీకెండ్ రిలీజ్

Thursday,October 24,2019 - 11:37 by Z_CLU

ఈ వీకెండ్ మొత్తం డబ్బింగ్ సినిమాలు, చిన్న సినిమాలదే హవా. కార్తి, విజయ్ నటించిన సినిమాలు డబ్బింగ్ రూపంలో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాయి. వీటితో పాటు వనవాసం, తుపాకిరాముడు అనే మరో 2 చిన్న సినిమాలు కూడా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి.

కార్తి నటించిన సినిమా ఖైదీ. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్ పై లోకేష్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో ఖైదీగా కనిపించబోతున్నాడు కార్తి. పదేళ్లుగా కూతుర్ని చూడక తపించిపోతున్న ఓ ఖైదీ తండ్రికి, ఎట్టకేలకు కూతుర్ని చూసే అవకాశం వస్తే ఏం చేశాడనేది ఈ సినిమా స్టోరీ. దీపావళి కానుకగా థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాను తెలుగులో సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ రిలీజ్ చేస్తున్నారు.

బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో టాలీవుడ్ ఆడియన్స్ ను కూడా ఎంటర్ టైన్ చేస్తున్న విజయ్.. ఈసారి విజిల్ సినిమాతో మనముందుకొస్తున్నాయి. పోలీస్, అదిరింది లాంటి మూవీస్ తర్వాత విజయ్-డైరక్టర్ అట్లీ కాంబోలో వస్తున్న సినిమా ఇది. ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్, డ్యూయల్ రోల్ చేశాడు. నయనతార హీరోయిన్. గత సినిమాలు హిట్ అవ్వడంతో తెలుగులో విజిల్ ను ఏకంగా 700 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.

ఈ సినిమాలతో పాటు వనవాసం, తుపాకిరాముడు అనే మరో రెండు సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. యదార్థ సంఘటనల ఆధారంగా వనవాసం తెరకెక్కితే.. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తుపాకి రాముడు అనే కామెడీ ఎంటర్ టైనర్ వస్తోంది. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ సినిమాను నిర్మించగా.. బిత్తిరి సత్తి, ప్రియ హీరోహీరోయిన్లుగా నటించారు.