వీకెండ్ రిలీజెస్

Tuesday,July 16,2019 - 01:19 by Z_CLU

ఈ వీకెండ్ 4 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో ఇస్మార్ట్ శంకర్ మూవీ గురువారమే థియేటర్లలోకి వస్తుండగా.. మిగతా 3 సినిమాలు శుక్రవారం రిలీజ్ అవుతున్నాయి. ఆ మూవీ డీటెయిల్స్ చెక్ చేద్దాం.

రామ్-పూరి కాంబినేషన్ లో పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన సినిమా ఇస్మార్ట్ శంకర్. వీళ్లిద్దరిది ఫ్రెష్ కాంబినేషన్. నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, 2 ట్రయిలర్స్ సూపర్ హిట్ అవ్వడంతో మూవీపై అంచనాలు డబుల్ అయ్యాయి. ఈ వీకెండ్ భారీ ఎత్తున విడుదలవుతున్న సినిమా ఇదే.

ఇక శుక్రవారం 2 డబ్బింగ్ సినిమాలు పోటీపడుతున్నాయి. అమలాపాల్ నటించిన ఆమె సినిమాతో పాటు.. విక్రమ్ చేసిన మిస్టర్ కేకే సినిమా థియేటర్లలోకి వస్తున్నాయి. అమలాపాల్ నటించిన మొట్టమొదటి థ్రిల్లర్ ఆమె. భిన్న‌మైన కాన్సెప్టుతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు ర‌త్న‌కుమార్. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, ఫ‌స్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అమ‌లా పాల్ బోల్డ్ లుక్ కూడా సంచ‌ల‌నం సృష్టించింది. ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ్, చ‌రిత చిత్ర ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

ఆమెకు పోటీగా విక్రమ్ నటించిన మిస్టర్ కేకే కూడా వస్తోంది. ఇది ఓ యాక్షన్ మూవీ. రాజేష్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో కమల్ హాసన్ కూతురు అక్షర హాసన్ ఓ కీలక పాత్ర పోషించింది. జిబ్రాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. విక్రమ్ ఈ సినిమాలో కమాండర్ గా కనిపించబోతున్నాడు. స్క్రీన్ ప్లేతో ఈ సినిమా ఆకట్టుకుంటుందట.

ఈ సినిమాలతో పాటు డిస్నీ నిర్మించిన భారీ యానిమేషన్ చిత్రం లయన్ కింగ్ కూడా శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది. త్రీడీ యానిమేషన్ లో భారీ గ్రాఫిక్స్ తో వస్తున్న ఈ సినిమాలో కీలకమైన పాత్రలకు నాని, బ్రహ్మానందం, అలీ, జగపతిబాబు లాంటి ప్రముఖులు డబ్బింగ్ చెప్పడం విశేషం.