వీకెండ్ బాలీవుడ్ రిలీజెస్

Thursday,June 08,2017 - 03:14 by Z_CLU

ఈ వీకెండ్ బాలీవుడ్ లో 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ రెండు సినిమాల మధ్య పోటీ సంగతి పక్కనపెడితే.. ఆ రెండు మూవీస్ కు ఓ హాలీవుడ్ మూవీ పెద్ద పోటీ ఇవ్వబోతోంది. ఆ మూవీస్ ఏంటో చూద్దాం.

శృతిహాసన్, రాజ్ కుమార్ రావు జంటగా నటించిన చిత్రం బెహన్ హోగీ తేరీ. టైటిల్ తోనే ఎట్రాక్ట్ చేసిన మూవీ ఇది. ట్రయిలర్, సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత సినిమాపై ఇంకాస్త హైప్ పెరిగింది. రేపు థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాపైనే శృతిహాసన్ బాలీవుడ్ కెరీర్ ఆధారపడి ఉంది. ఈ సినిమా క్లిక్ అయితే స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు రావడం ఖాయం.

బెహెన్ హోగీ తేరీ సినిమాతో పాటు థియేటర్లలోకి వస్తోంది రాబ్తా మూవీ. సుశాంత్ సింగ్, కృతి సనన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఓ పీరియాడిక్ డ్రామా. తెలుగులో చరిత్ర సృష్టించిన మగధీర సినిమా స్ఫూర్తితో ఈ మూవీ తెరకెక్కిందనే రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాపై కూడా ఓ మోస్తరు అంచనాలున్నాయి.

 

ఈ రెండు సినిమాలకు పోటీగా వస్తోంది ‘ది మమ్మీ’. హాలీవుడ్ యాక్షన్ స్టార్ టామ్ క్రూస్ హీరోగా నటించిన ఈ సినిమా రేపు భారీస్థాయిలో ఇండియాలో విడుదల అవుతోంది. ఇప్పటికే విడుదలైన వండర్ ఉమెన్ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్న నేపథ్యంలో.. ది మమ్మీ కూడా బాలీవుడ్ కు గండికొడుతుందని అంచనా వేస్తున్నారు.