ఈ వీకెండ్ ఎట్రాక్షన్స్

Thursday,May 17,2018 - 03:41 by Z_CLU

మహానటి సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. నా పేరు సూర్య సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. మరోవైపు భరత్ అనే నేను, రంగస్థలం సినిమాలు కూడా ఇంకా కొనసాగుతున్నాయి. ఇలాంటి టైమ్ లో మరో సినిమా రిలీజ్ చేయడానికి థియేటర్లు కూడా దొరకని పరిస్థితి. కానీ ఉన్నంతలో రెండు సినిమాలు ఈ వీకెండ్ ఎట్రాక్షన్స్ గా థియేటర్లలోకి వస్తున్నాయి.

వీకెండ్ ఎట్రాక్షన్ గా వస్తున్న సినిమా కాశి. విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే 7 నిమిషాల సీన్ రిలీజ్ చేశారు. దీంతో మూవీపై కాస్త క్యూరియాసిటీ పెరిగింది. అమెరికాలో డాక్టర్ గా పనిచేసే హీరోకు ప్రతి రాత్రి ఒకే కల వస్తుంటుంది. ఆ కల ఎందుకొస్తుందో తెలుసుకోవడం కోసం ఇండియా వెళ్లిన హీరోకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.. ఇంతకీ అతనెవరు అనేది కాశి కథ

ఆర్.నారాయణ మూర్తి నటించిన అన్నదాత సుఖీభవ సినిమా కూడా శుక్రవారం విడుదలవుతోంది. అన్నీ తానై ఆర్.నారాయణమూర్తి తెరకెక్కించిన ఈ సినిమాలో రైతుల సమస్యల్ని ప్రధానంగా చర్చించారు. పంట గిట్టుబాటు ధరలు, నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులు లాంటి ఎలిమెంట్స్ పై సీరియస్ గా చర్చించేలా ఈ సినిమా తెరకెక్కింది.

కాశి, అన్నదాత సుఖీభవ సినిమాలతో పాటు శ్రీనుగాడి ప్రేమ అనే మరో చిన్న సినిమా, డెడ్ పూల్-2 అనే ఇంగ్లిష్ డబ్బింగ్ సినిమా కూడా రేపు థియేటర్లలోకి వస్తున్నాయి. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఉన్న భారీ కాంపిటిషన్ మధ్య వీటిలో ఏ సినిమా క్లిక్ అవుతుందో చూడాలి.