దీపిక, రణ్వీర్ వెడ్డింగ్ డేట్ వచ్చేసింది

Thursday,June 21,2018 - 03:40 by Z_CLU

దాదాపు మూడేళ్లుగా ప్రేమించుకుంటోంది ఈ జంట. ఇప్పుడు పెళ్లితో ఒకటవ్వాలని ఫిక్స్ అయింది. పైకి చెప్పకపోయినా వీళ్ల పెళ్లకి దాదాపు నెల రోజుల నుంచి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా ఇద్దరూ విదేశాలకు వెళ్లి షాపింగ్స్ కూడా చేస్తున్నారు. తాజాగా వీళ్ల పెళ్లికి డేట్ ఫిక్స్ అయింది.

అన్నీ అనుకున్నట్టు జరిగితే నవంబర్ 10న వీళ్ల వివాహం జరుగుతుంది. అప్పటికి తన కమిట్ మెంట్స్ అన్నీ పూర్తిచేయాలని ఫిక్స్ అయ్యాడు రణ్వీర్ సింగ్. ఇక దీపిక అయితే దాదాపు నెల రోజుల కిందటే తన ప్రాజెక్టులన్నీ పూర్తిచేసింది. పెళ్లి కోసం ఓ హాలీవుడ్ ఆఫర్ కూడా వదులుకుంది.

డిస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసింది ఈ జంట. దీని కోసం ఇటలీని సెలక్ట్ చేసుకుంది. అతికొద్ది మంది సన్నిహితులు, బంధువులను మాత్రమే ఈ పెళ్లికి ఆహ్వానించబోతున్నారు. పెళ్లి తర్వాత ముంబయిలో పెద్ద పార్టీ ఇస్తారు.