నిర్మాతలుగా గర్వపడుతున్నాం -లగడపాటి శిరీష శ్రీధర్

Sunday,May 06,2018 - 09:30 by Z_CLU

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘నా పేరు సూర్య’ సినిమా ఇటివలే గ్రాండ్ గా రిలీజైన సంగతి తెలిసిందే… మార్నింగ్ షో నుండే పాజిటీవ్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ సినిమాకి సంబంధించి వస్తున్న రెస్పాన్స్ గురించి మీడియా ద్వారా ఆడియన్స్ కు తెలియజేసారు నిర్మాతలు లగడపాటి శిరీష శ్రీధర్…

ఈ సందర్భంగా నిర్మాతలు లగడపాటి శిరీష శ్రీధర్ మాట్లాడుతూ ” ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా  45 కోట్లు(గ్రాస్) కలెక్ట్ చేసింది. రిలీజ్ రోజు మార్నింగ్ షో నుండి అన్నీ ఏరియస్ నుండి భారీ రెస్పాన్స్ వస్తుంది. అందరూ కాల్ చేసి ఒక గొప్ప సినిమా నిర్మించారు. కంగ్రాట్స్ అంటూ చెప్తూ సినిమాలో హైలైట్స్ అన్నీ ఒక్కొక్కటిగా చెప్తూ మెసేజెస్ చేస్తున్నారు. మా బందువులు, శ్రేయోభిలాషులు, సినిమా లవర్స్ నుండి గొప్ప రెస్పాన్స్ వస్తుంది. కొన్ని సినిమాలకే ఇలాంటి ప్రసంశలు లభిస్తాయి. కేవలం తెలుగులో కాదు తమిళ్ , మలయాళం నుండి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా అక్కడ డిస్ట్రి బ్యూటర్స్ వాళ్ళ ఫామిలీస్ తో సినిమా చూశామని అలాగే ఫామిలీస్ తమ పిల్లలతో సినిమాకి వస్తున్నారని చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ సక్సెస్ మా సంస్థకి అందించిన బన్నీ కి వక్కంతం వంశీ గారికి అలాగే మా పార్ట్నర్స్ నాగబాబు గారికి , బన్నీ వాస్ కి కృతజ్ఞతలు. గతంలో ఎన్నో సినిమాలు నిర్మించినప్పటికీ ఈ సినిమా మా బ్యానర్ కి అలాగే మాకు గొప్ప గుర్తింపు తీసుకొచ్చింది.  ఇలాంటి ఒక గొప్ప సినిమా నిర్మించినందుకు  గర్వపడుతున్నాం. సినిమాను గ్రాండ్ హిట్  చేసిన  ప్రేక్షకులందరికీ మా ధన్యవాదాలు.” అన్నారు.