Pataas 2 సీక్వెల్ పై స్పందించిన దర్శకుడు

Friday,February 18,2022 - 02:45 by Z_CLU

We are planning ‘Pataas 2’, said Director Anil Ravipudi

ప్రస్తుతం టాప్ డైరెక్టర్స్ లో ఒకడిగా గుర్తింపు అందుకున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి మొదటి సినిమా ‘పటాస్’ అని అందరికీ తెలిసిందే. కళ్యాణ్ హీరోగా స్వీయ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాతో డైరెక్టర్ గా తన సత్తా ఏంటో చూపించాడు అనిల్ రావిపూడి. ఆ సినిమా సక్సెస్ తర్వాత మళ్ళీ వెనక్కి చూసుకోకుండా టాప్ లీగ్ లోకి వెళ్ళిపోయాడు. రవితేజ , వెంకటేష్ , మహేష్ బాబు ఇలా స్టార్ హీరోలను రీచ్ అయి సినిమాలు చేస్తున్నాడు.

అయితే ఇప్పుడు ఈ టాప్ డైరెక్టర్ తనకి మొదటి అవకాశం ఇచ్చిన హీరో కం నిర్మాత కళ్యాణ్ రామ్ తో మళ్ళీ సినిమా చేస్తాడా ? అని డౌట్ మొన్నటి వరకూ నందమూరి ఫ్యాన్స్ లో ఉంది. దానికి ఇటివలే ఓ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చాడు అనిల్ రావిపూడి. మొదటి సినిమా ‘పటాస్’ రిలీజై ఏడేళ్ళు గడిచిన సందర్భంగా ఆ సినిమా జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ కళ్యాణ్ రామ్ తో  మళ్ళీ తప్పకుండా సినిమా చేస్తానని తెలిపాడు. ఇటివలే ‘పటాస్’ సినిమా వార్షికోత్సవం సందర్భంగా హీరో కళ్యాణ్ రామ్ తో మాట్లాడానని ఆయన ‘పటాస్ 2’ చేయాలి అని అన్నారని తప్పకుండా చేద్దాం అని చెప్పానని చెప్పుకున్నాడు.

Also Read కుర్ర హీరోయిన్ కి భారీ ఆఫర్ ?

ప్రస్తుతం అనిల్ రావిపూడి వెంకటేష్ , వరుణ్ లతో ‘F3’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎండింగ్ స్టేజిలో ఉంది. త్వరలోనే బాలయ్య తో నెక్స్ట్ సినిమా చేయనున్నాడు. వీరి కాంబో సినిమా ఆల్రెడీ లాక్ అయింది. రెండు మూడు నెలల్లో సెట్స్ పైకి వెళ్లనుంది.  ఇక కళ్యాణ్ రామ్ కూడా ఫుల్ బిజీ గా ఉన్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. సో ఇద్దరూ కమిట్ అయిన ప్రాజెక్ట్స్ పూర్తి చేశాక మళ్ళీ వీరిద్దరి కాంబో సినిమా ఉండొచ్చు.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics