ఎక్కువ సార్లు పెళ్లి చేసుకుంటా -కంగనా

Monday,July 25,2016 - 11:39 by Z_CLU

 

హృతిక్ రోషన్ తో వివాదం కారణంగా ఈమధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నలిగిన కంగనా రనౌత్ మరోసారి ఇప్పుడు హెడ్ లైన్స్ లోకి ఎక్కింది. ఎవరూ ఊహించని విధంగా ఆమె చేసిన వ్యాఖ్యలు అందర్నీ షాక్ కు గురిచేశాయి. ఎక్కువ సార్లు పెళ్లి చేసుకోవాలని ఉందంటూ ఆమె స్టేట్ మెంట్ ఇవ్వడమే దీనికి కారణం. ఆమె ఈ ప్రకటన చేసిన వెంటనే అక్కడ ఉన్నవాళ్లంతా అంతా షాక్ అయ్యారు. అయితే కంగనా ఇలా రియాక్ట్ అవ్వడం వెనక ఉద్దేశం మాత్రం వేరు.

ఇండియా కౌంటర్ వీక్ 2016 ఫాషన్ షో లో ముఖ్య అతిగా పాల్గొన్నఈ భామ తాను ఒకటి కంటే ఎక్కువ సార్లు పెళ్లి చేసుకుంటాని చెప్పింది. ప్రముఖ డిజైనర్ మానవ్ గాంగ్వానీ రూపొందించిన పెళ్లి దుస్తులు ధరించి క్యాట్ వ్యాక్ చేసి షో స్టాపర్ గా నిలిచిన ఈ బ్యూటీ… మానవ్ గాంగ్వానీ రూపొందించిన పెళ్లి దుస్తులు తనను ఆకట్టుకున్నాయని…. నా పెళ్లి కి ఈ దుస్తులే ధరిస్తానని చెప్పింది. అయితే ఇలాంటి దుస్తులను ఎక్కువ సార్లు వేసుకోవాలంటే… ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోవాలని సరదాగా చెప్పుకొచ్చింది. కంగనా మాటలకు ముందుగా కంగారుపడిన అక్కడి వారు తరువాత ఆమె మాటల్లో మీనింగ్ అర్థమై నవ్వుకున్నారు.