HIT-The Second Case - మొదలైంది
Saturday,March 20,2021 - 03:40 by Z_CLU
వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌పై అడివి శేష్ హీరోగా ‘హిట్ 2’.. లాంఛనంగా ప్రారంభం
రీసెంట్గా హిట్ సినిమాకు ఫ్రాంచైజీగా ‘హిట్ 2’ చిత్రాన్ని రూపొందించనున్నట్లు నాని ప్రకటించిన సంగతి తెలిసిందే. అనౌన్స్ చేసినట్టుగానే ఈరోజు ‘హిట్ 2’ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ‘ది సెకండ్ కేస్’ సినిమా ట్యాగ్‌లైన్. హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలోనే హిట్-2 వస్తోంది.

ముహుర్త సన్నివేశానికి హీరో నాని క్లాప్ కొట్టి స్క్రిప్ట్‌ను డైరెక్టర్ శైలేష్‌కు అందించారు. నిర్మాత ప్రశాంతి తిపిర్నేని కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
`క్షణం, గూఢచారి, ఎవరు` వంటి వైవిధ్యమై కథా చిత్రాల్లో హీరోగా నటించిన తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఇప్పుడు దేశభక్తితో నిండిన పాన్ ఇండియా మూవీ `మేజర్`లో నటిస్తున్న అడివిశేష్ కృష్ణ దేవ్ అలియాస్ కె.డి పాత్రలో నటిస్తున్న ‘హిట్ 2’ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీస్ ఆఫీసర్ అమ్మాయి మిస్సింగ్ కేసుని ఎలా డీల్ చేశాడనే కాన్సెప్ట్‌తో హిట్ (మోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్) సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చెందిన హిట్ టీమ్ ఆఫీసర్ కృష్ణ దేవ్ అలియాస్ కె.డి ఈ ఎగ్జయిటింగ్ జర్నీని కంటిన్యూ చేయబోతున్నారు. మణికందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్ స్టీవర్ట్ ఎడురి సంగీతాన్ని అందించనున్నారు.
