బన్నీని ఊరిస్తున్న ముద్దుగుమ్మలు...

Friday,September 09,2016 - 09:00 by Z_CLU

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం ‘డీజే. ఇక్కడ డీజే అంటే డిస్క్ జాకీ కాదు దువ్వాడ జగన్నాథమ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈమధ్యే ఈ సినిమా ప్రారంభమైంది. సెట్స్ పైకి రావడానికి మాత్రం ఇంకాస్త టైం పడుతుంది. ఈ గ్యాప్ లో హీరోయిన్లను ఫిక్స్ చేయాలనుకున్నాడు బన్నీ. ప్రస్తుతం బన్నీ మనసులో ఇద్దరు ముద్దుగుమ్మలు దోబూచులాడుతున్నారు. వాళ్లే కాజల్, పూజా హెగ్డే. టాలీవుడ్ గాసిప్ ప్రకారం… వీళ్లిద్దర్లో ఒకర్ని బన్నీ సరసన హీరోయిన్ గా తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం కాజల్, చిరంజీవి 150వ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. బన్నీ-కాజల్ కాంబోలో ఆర్య-2, ఎవడు సినిమా వచ్చాయి. ఈ సినిమాకు కాజల్ ఓకే అయితే అది హ్యాట్రిక్ మూవీగా మారే అవకాశాలున్నాయి. అటు పూజా హెగ్డే పేరును దర్శకుడు హరీష్ శంకర్ ప్రపోజ్ తెలుస్తోంది. సో… వీళ్లిద్దర్లో ఎవర్ని సెలక్ట్ చేస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్.