వెంకటేష్ తో వినాయక్ సినిమా !

Sunday,October 13,2019 - 12:13 by Z_CLU

‘ఇంటెలిజెంట్’ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ ఆ బ్రేక్ లో హీరోగా ఓ సినిమా ఫైనల్ చేసుకున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో నరసింహ రావు డైరెక్షన్ లో ‘సీనయ్య’ సినిమా చేయబోతున్నాడు. నవంబర్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

ఈ సినిమా తర్వాత వెంకటేష్ తో ఓ సినిమా చేసేందుకు సిద్దమవుతున్నాడు వినాయక్. ఇప్పటికే వెంకటేష్ ను అప్రోచ్ అయ్యాడు. కథా చర్చలు కూడా జరిగాయి. నల్లమల బుజ్జి ఈ సినిమాను నిర్మిస్తాడు. అయితే ఈ కాంబినేషన్ సినిమాకు ఇంకా టైం పడుతుంది. అందుకే ఈ లోపు వినాయక్ ‘సీనయ్య’ పూర్తి చేయాలని డిసైడ్ అయ్యాడు. అన్ని అనుకున్నట్లే జరిగితే త్వరలోనే వెంకీ -వినాయక్ సినిమా అనౌన్స్ మెంట్ ఉంటుంది.