ఉన్నది ఒకటే జిందగీ.. టాప్-5 ఎట్రాక్షన్స్

Thursday,October 26,2017 - 02:09 by Z_CLU

ఒక సినిమా వస్తుందనగానే అసలు ఆ సినిమా ఎందుకు చూడాలనే ప్రశ్న వస్తుంది. ప్రతి సినిమాను ఎందుకు చూడాలనే ప్రశ్నకు కొన్ని సమాధానాలుంటాయి. ఉన్నది ఒకటే జిందగీ కూడా కచ్చితంగా చూడాలనడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అందులో టాప్-5 ఎట్రాక్షన్స్ ఏంటో చూద్దాం.

ఎట్రాక్షన్-1 : స్టోరీలైన్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన ఉన్నది ఒకటే జిందగీకి మెయిన్ ఎట్రాక్షన్ ఈ సినిమా స్టోరీ లైన్. ఫ్రెండ్ షిప్ పై ఎన్నో సినిమాలొచ్చాయి. కానీ ఈ సినిమా వాటన్నింటికంటే భిన్నమైంది. ఎందుకంటే చాలా రియలిస్టిక్ గా ఉండే సన్నివేశాలు, ఎమోషన్స్ మధ్య అల్లిన కథ ఇది. ఇంకా చెప్పాలంటే హీరో రామ్, దర్శకుడు కిషోర్ తిరుమల జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు కూడా ఇందులో కనిపిస్తాయి. ఈ సినిమాకు ఫస్ట్ హీరో కథ. ప్రతి ఒక్కరి మనసుల్ని తాకే ఈ కథ కోసం ఉన్నది ఒక్కటే జిందగీని తప్పకుండా చూడాలి.

ఎట్రాక్షన్-2 :  కాంబినేషన్

ఈ సినిమా ఎందుకు చూడాలనే ప్రశ్నకు మరో మెయిన్ రీజన్ సినిమాలో హీరో-దర్శకుడి కాంబినేెషన్. ఈ సినిమాకు ఇదో మెయిన్ ఎట్రాక్షన్ కూడా. గతంలో రామ్-కిషోర్ తిరుమల కాంబోలో వచ్చిన నేను శైలజ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. అలాంటి కాంబినేషన్ ఇప్పుడు ఉన్నది ఒకటే జిందగీ అంటూ ప్రేక్షకుల్ని థియేటర్లకు ఆహ్వానిస్తోంది.

ఎట్రాక్షన్-3  : మేకోవర్

ఇప్పటివరకు రామ్ ను ఎవ్వరూ ఇలాంటి లుక్ లో చూడలేదు. సరికొత్తగా, మోస్ట్ స్టయిలిష్ గా తయారైన రామ్ ను సిల్వర్ స్క్రీన్ పై చూడాల్సిందే. ఈ సినిమా స్టోరీలైన్ అనుకున్నప్పట్నుంచే మేకోవర్ కోసం చాలా కష్టపడ్డాడు రామ్. ఆ కష్టం సినిమాలో కనిపిస్తుంది. కేవలం గడ్డం, మీసం పెంచడమే మేకోవర్ కాదు. క్యారెక్టర్ కోసం బాడీని షేప్ చేసుకున్న విధానం, రాక్ బ్యాండ్ లో సభ్యుడిగా కనిపించడం కోసం రామ్ గిటార్ నేర్చుకోవడం.. ఇవన్నీ మేకోవర్ లో భాగమే.

ఎట్రాక్షన్-4 : మ్యూ జిక్

ఉన్నది ఒకటే జిందగీ సినిమాను కచ్చితంగా ఎందుకు చూడాలనే ప్రశ్నకు మరో మెయిన్ రీజన్ మ్యూజిక్. ఈ సినిమాలో పాటలు ఇప్పటికే సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా ఫ్రెండ్ షిప్ సాంగ్, వాట్ అమ్మా సాంగ్స్ అయితే చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. మరి ఇంత సూపర్ హిట్ అయిన ఆడియోను.. వెండితెరపై విజువల్ గా చూడకుండా ఉండలేం కదా. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు అద్భుతమైన ట్యూన్స్ అందించాడు. రిలీజ్ కు ముందే సినిమా సగం హిట్ అయిందంటే దానికి కారణం ఈ సంగీతమే.

ఎట్రాక్షన్-5 : హీరోయిన్స్

ఉన్నది ఒకటే జిందగీ సినిమాకు మరో మెయిన్ ఎట్రాక్షన్ హీరోయిన్స్. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్లు గా నటించారు. ఇద్దరూ చాలా నేచురల్ గా నటించి సినిమాకు ప్లస్ అయ్యారు. యూనిట్ లో ప్రతి ఒక్కరు చెబుతున్న మాటిది. అంతేకాదు.. సినిమా అయిపోయిన తర్వాత వీళ్ల పాత్రలు ప్రేక్షకుల్లో గుండెల్లో నిలిచిపోతాయి.

ఇక్కడ మనం చెప్పుకున్నది కేవలం టాప్-5 ఎట్రాక్షన్స్/రీజన్స్ మాత్రమే. ఇవి కాకుండా.. ఉన్నది ఒకటే జిందగీ సినిమా చూడ్డానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మంచి ప్రొడక్షన్స్ వాల్యూస్, మనసుకు హత్తుకునే డైలాగ్స్, రామ్ పర్ఫార్మెన్స్/డాన్స్, కామెడీ, హ్యూమన్ ఎమోషన్స్.. ఇవన్నీ సినిమాను సంథింగ్ స్పెషల్ గా మార్చాయి.