మరో 2 రోజుల్లో ఉన్నది ఒకటే జిందగీ రిలీజ్

Wednesday,October 25,2017 - 11:48 by Z_CLU

రామ్ ‘ఉన్నది ఒకటే జిందగీ’ మరో 2 రోజుల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే యూత్ లో అవుట్ స్టాండింగ్ క్రేజ్ ని క్రియేట్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ టాలీవుడ్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది. రామ్ సరసన లావణ్య త్రిపాఠి, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా రిలీజ్ కి ఇప్పటికే రిలీజైన ట్రైలర్స్ తో, సాంగ్స్ తో యూత్ ని ఎట్రాక్ట్ చేయడంలో సక్సెస్ అయింది.

కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ ఇమోషనల్ యూత్ ఎంటర్ టైనర్ రామ్ కరియర్ లో మరో మైల్ స్టోన్ అనిపించుకోవడం ఖాయం అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. DSP మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా ఈ శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ కానుంది.