ఉన్నది ఒకటే జిందగీ.. మరికాసేపట్లో ప్రీమియర్స్

Thursday,October 26,2017 - 11:52 by Z_CLU

రామ్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించిన సెన్సిబుల్ మూవీ ఉన్నది ఒకటే జిందగీ. రామ్, కిషోర్ తిరుమల హిట్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఆ ఎక్స్ పెక్టేషన్స్ కు తగ్గట్టే ఉన్నది ఒకటే జిందగీ సినిమాను ఓవర్సీస్ లో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. సినిమాపై ఓవర్సీస్ ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని మరికొన్ని గంటల్లో అమెరికాలో ప్రీమియర్స్ ప్లాన్ చేశారు.

ఉన్నది ఒకటే జిందగీ ప్రీమియర్స్ కోసం యూఎస్ లో భారీ ఏర్పాట్లు జరిగాయి. దాదాపు 115కు పైగా లొకేషన్లలో ప్రీమియర్స్ కు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికాసేపట్లో ఓవర్సీస్ ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలో ఎంజాయ్ చేయబోతున్నారు. అంతే కాదు, ఫస్ట్ రిపోర్ట్ కూడా అక్కడ్నుంచే రాబోతోంది.

రామ్-కిషోర్ తిరుమల కాంబోలో గతంలో నేను శైలజ సినిమా వచ్చింది. అది ప్యూర్ లవ్ స్టోరీ. ఈసారి ఈ కాంబినేషన్ లో ప్యూర్ ఫ్రెండ్ షిప్ ను చూపించబోతున్నారు. జీవితంలోని ప్రతి దశలో స్నేహితుడు ఎంత ముఖ్యమైనవాడో చెప్పే ప్రయత్నం చేశారు. ఓవర్సీస్ లో ఈ సినిమాను యూఎస్ తెలుగు మూవీస్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.