జీ సినిమాలు అవార్డుల సంబరం.. మీ జీ సినిమాలు ఛానెల్ లో...

Wednesday,March 22,2017 - 12:30 by Z_CLU

జీ సినిమాలు అవార్డ్స్… తెలుగు సినిమా ఛానెల్స్ లోనే ఫస్ట్ టైం జీ సినిమాలు చేసిన అటెంప్ట్ కి అదిరిపోయే రెస్పాన్స్ ఇచ్చారు ప్రేక్షకులు.  ఫిబ్రవరి 16 న zeecinemalu.com లో ఓటింగ్ బిగిన్ అయిన క్షణం నుంచి రికార్డు స్థాయిలో ఓట్లు వేసి ఫేవరెట్ స్టార్స్ పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. 12 లక్షలకు పైగా ఓట్లు నమోదయ్యాయంటే జీ సినిమాలు అవార్డ్స్ ఏ రేంజ్ లో ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసిందో  అర్థంచేసుకోవచ్చు. అలా ఒక సెలబ్రేషన్ లా సాగిన ఈ అవార్డుల ఓటింగ్ ప్రక్రియ.. ఇప్పుడు మరో సెలబ్రేషన్ లోకి అడుగుపెట్టింది.


మొత్తం 11 కేటగిరీల్లో సాగిన ఈ పోలింగ్ ప్రక్రియలో విజేతలు ఎవరనే వివరాల్ని జీ సినిమాలు ఛానెల్ లో గ్రాండ్ గా ఎనౌన్స్ చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని ప్రస్తుతం జీ సినిమాలు ఛానెల్ లో మీరు చూడొచ్చు. వాచ్ జీ సినిమాలు అవార్డ్స్ ఆన్ జీ సినిమాలు.