ప్రభాస్ కోసం బాలీవుడ్ యాక్టర్

Saturday,March 04,2017 - 06:30 by Z_CLU

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్ సినిమా పై ఫోకస్ పెట్టి త్వరలోనే ఆ సినిమాతో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు… సుజీత్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా కోసం హీరోయిన్స్ తో పాటు విలన్ ని కూడా సెలెక్ట్ చేసే పనిలో పడ్డారట మేకర్స్…


ఇప్పటికే ప్రభాస్ కోసం బాలీవుడ్ హీరోయిన్స్ తో పాటు విలన్ ని కూడా సంప్రదిస్తున్నారట మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా కు బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్ ను సెలెక్ట్ చేశారనే వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ‘రక్త చరిత్ర’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన వివేక్ ఒబెరాయ్ ఈ సినిమాలో స్టైలిష్ విలన్ గా ప్రభాస్ ను కొట్టే క్యారెక్టర్ లో కనిపిస్తాడనే టాక్ వినిపిస్తుంది.. ఈ వార్తలో నిజం ఎంతో తెలియాలంటే మేకర్స్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే…