విశ్వరూపం-2: నా దృష్టిలో ఇది రెండు సినిమాలు కాదు

Friday,August 03,2018 - 11:44 by Z_CLU

యూనివర్శల్‌ హీరో కమల్‌హాసన్‌ నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘విశ్వరూపం’ సంచలన విజయాన్ని సాధించిన విషయం తెల్సిందే. ఆ చిత్రానికి సీక్వెల్‌గా వస్తోంది ‘విశ్వరూపం-2’. ఆండ్రియా, పూజా కుమార్‌ హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రానికి జిబ్రాన్‌ మ్యూజిక్‌ని అందించారు.

ఈ చిత్రం ఆడియో రిలీజ్‌ ఫంక్షన్ నిన్న (ఆగస్ట్‌ 2) హైదరాబాద్‌ లో గ్రాండ్ గా జరిగింది. కమల్‌హాసన్‌, హీరోయిన్స్‌ ఆండ్రియా, పూజా కుమార్‌, సంగీత దర్శకుడు జిబ్రాన్‌, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ‘విశ్వరూపం-2’ ఆడియో సీడిలను యూనివర్శల్‌ స్టార్‌ కమల్‌హాసన్‌ రిలీజ్‌ చేశారు. లహరి మ్యూజిక్‌ ద్వారా ఆడియో విడుదలైంది.

యూనివర్శల్‌ హీరో కమల్‌హాసన్‌ మాట్లాడుతూ – ”విశ్వరూపం మా దృష్టిలో ఒకే సినిమా. రెండు భాగాలుగా విడుదల చేస్తున్నాం. ‘విశ్వరూపం’ పార్ట్‌ వన్‌ కంటే ఇంకా బెటర్‌గా పార్ట్‌ 2ను చేశాం. ఆగస్ట్‌ 10 కోసం ఆత్రుతగా వెయిట్‌ చేస్తున్నాం.” అన్నారు.

ఆస్కార్‌ ఫిలిం ప్రై. లిమిటెడ్‌ బేనర్‌పై రాజ్‌ కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ సమర్పణలో ఎస్‌. చంద్రహాసన్‌, కమల్‌హాసన్‌ కలిసి నిర్మించిన ఈ సినిమా.. ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలవుతోంది.