రేపే విశ్వరూపం 2 గ్రాండ్ రిలీజ్

Thursday,August 09,2018 - 01:15 by Z_CLU

కమలహాసన్ నటించి దర్శకత్వం వహించిన ‘విశ్వరూపం 2’ రేపే గ్రాండ్ గా రిలీజవుతుంది. కరుణానిధి మృతి కారణంగా ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే చాన్సెస్ ఉన్నాయని నిన్న సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తమయినా, సినిమా ముందుగా ఫిక్స్ చేసిన డేట్ కే థియేటర్స్ లోకి వస్తుందని కన్ఫమ్ చేశాడు కమలహాసన్.

టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో మోస్ట్ ఇంటెన్సివ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే ఇండియా వైడ్ గా ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. విశ్వరూపం పార్ట్ 1 కన్నా, విశ్వరూపం 2 అంచనాలకు మించి ఉంటుందని ఫిలిమ్ మేకర్స్ చేస్తున్న ప్రమోషన్స్ ఆడియెన్స్ లో క్యూరాసిటీ రేజ్ చేస్తున్నాయి.

ఈ సినిమాలో కమలహాసన్ సరసన పూజా కుమార్ హీరోయిన్ గా నటించింది. రాహుల్ బోస్, ఆండ్రియా, శేఖర్ కపూర్ సినిమాలో కీ రోల్స్ ప్లే చేశారు. జిబ్రాన్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేశాడు.