విశ్వరూపం-2 ఫస్ట్ లుక్ రిలీజ్

Tuesday,May 02,2017 - 07:06 by Z_CLU

కమల్ హాసన్ నటిస్తున్న ప్రతిష్టాత్మక విశ్వరూపం-2 ఫస్ట్ లుక్ రిలీజైంది. అన్నీ తానై లోకనాయకుడు కమల్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఇది. దాదాపు మూడేళ్లుగా సెకెండ్ పార్ట్ కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ ఏడాదిలోనే సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించిన కమల్.. ఆ ప్రకటన చేసిన కొన్ని రోజులకే సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు.

ఎన్నో అవాంతరాలు, మరెన్నో వివాదాలు, ఇంకెన్నో రాజకీయాల మధ్య విడుదలైంది విశ్వరూపం-1 సినిమా. 2013లో విడుదలైన ఈ సినిమా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్నో అడ్డంకుల్ని అధిగమించి సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చారు కమల్. చివరికి కొన్ని ప్రాంతాల్లో విడుదలకు అడ్డంకులు ఏర్పడితే.. డీటీహెచ్ లో కూడా విశ్వరూపం సినిమాను తీసుకొచ్చారు.

ఈ సినిమాకు సెకెండ్ పార్ట్, 2014లోనే వస్తుందని అంతా ఊహించారు. ఎందుకంటే అప్పటికే 50శాతం షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. కానీ పార్ట్-1 విడుదల సందర్భంగా ఏర్పడిన అవాంతరాల వల్ల నిర్మాతలు పార్ట్-2ను విడుదల చేయడానికి ముందుకురాలేదు. ఎట్టకేలకు ఆ నిర్మాతల నుంచి విశ్వరూపం-2 రైట్స్ ను కమల్ దక్కించుకున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈ ఏడాదిలోనే సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తామంటున్నారు.