విజన్ ఆఫ్ భరత్ – అదిరింది

Tuesday,March 06,2018 - 06:42 by Z_CLU

అల్టిమేట్ పొలిటికల్ ఎంటర్ టైనర్ లా తెరకెక్కుతుంది మహేష్ బాబు ‘భరత్ అనే నేను’. ఇప్పటికే ఈ సినిమాపై హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయి ఉన్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు చీఫ్ మినిస్టర్ లా కనిపించనున్నాడు. అయితే ఫిల్మ్ మేకర్స్ అనౌన్స్ చేసినట్టు ఈ రోజు ‘విజన్ ఆఫ్ భరత్’ పేరిట ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్.

‘చిన్నప్పుడు మా అమ్మ నాకో మాట చెప్పింది.. అంటూ బిగిన్ అయ్యే టీజర్ ఎగ్జాక్ట్ స్టోరీ లైన్ రివీల్ కాకపోయినా,  ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజా ప్రతినిధిగా ప్రజలకు ఇచ్చిన మాటని హీరో ఎలా నిలబెట్టుకున్నాడు అనే ఇంటరెస్టింగ్ కాంఫ్లిక్ట్ తో తెరకెక్కుతుంది భరత్ అనే నేను. సినిమాలోని పొలిటికల్ ఆంగిల్ ని ఎలివేట్ చేస్తున్న ఈ టీజర్ ఏప్రియల్ 20 న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ భారీ ఎంటర్ టైనర్ పై పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేస్తుంది.

కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్. D.V.V. దానయ్య ప్రొడ్యూసర్.