Das Ka Dhumki విశ్వక్ సేన్ కొత్త సినిమా షురూ

Wednesday,March 09,2022 - 12:35 by Z_CLU

Vishwak Sen’s new movie ‘Das Ka Dhumki’ launched

త్వరలోనే ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’, ‘ఓరి దేవుడా’ అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విశ్వక్ సేన్ తాజాగా మరో సినిమాను స్టార్ట్ చేశాడు. ‘పాగల్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన నరేష్ కుప్పిలి డైరెక్షన్ లో ఇంకో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాకు ‘Das Ka Dhamki‘ అనే టైటిల్ ఫిక్స్ చేసి ఇవ్వాళ పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టారు.

వన్మయి క్రియేషన్స్ , విశ్వక్ సేన్ సినిమాస్ బేనర్స్ పై విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ – మాటలు అందిస్తున్న ఈ సినిమాకు లియోన్ జేమ్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నివేత పెతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 14 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. వీలైనంత త్వరగా షూట్ ఫినిష్ చేసి ఈ ఏడాదిలోనే సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రెజెంట్ ఈ సినిమా టైటిల్ లోగో పోస్టర్ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తుంది.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics