Vishwak Sen Paagal టీజర్ టాక్

Thursday,February 18,2021 - 11:56 by Z_CLU

విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న ‘పాగల్’ సినిమా టీజర్ రిలీజైంది. నరేష్ కొప్పిలి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హంగామా చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. టీజర్ లో విశ్వక్ సేన్ డైలాగ్స్ , లవ్ సీన్స్ , కామెడీ తో పాటు రాధన్ మ్యూజిక్ , మణికందన్ విజువల్స్ హైలైట్ గా నిలిచాయి.

విశ్వక్ సేన్ లవర్ బాయ్ గా కనిపిస్తూ తన నటనతో సినిమాకు హైలైట్ గా నిలవనున్నాడని టీజర్ తో హింట్ ఇచ్చారు మేకర్స్. యూత్ కి నచ్చే కంటెంట్ తో పాటు అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయని టీజర్ చూస్తే తెలుస్తుంది. ముఖ్యంగా రాహుల్ రామకృష్ణ కామెడీ ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్ మెంట్ అందించనుందనిపిస్తుంది.

దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా ఏప్రిల్ 30న థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమాతో విశ్వక్ సేన్ మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకోవడం ఖాయమనిపిస్తుంది.