అయోగ్యగా మనముందుకొస్తున్న విశాల్

Sunday,May 26,2019 - 03:12 by Z_CLU

హీరో విశాల్ లేటెస్ట్ త‌మిళ చిత్రం `అయోగ్య`. త‌మిళంలో విడుద‌లైన ఈ చిత్రం చాలా పెద్ద విజ‌యాన్ని సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో  కూడా`అయోగ్య‌` అనే టైటిల్‌తోనే విడుద‌ల చేస్తున్నారు.

తెలుగు నిర్మాత ఠాగూర్ మ‌ధు తొలిసారి త‌మిళంలో నిర్మించిన చిత్ర‌మిది. తొలి సినిమాతో ఠాగూర్ మ‌ధు నిర్మాత‌గా భారీ విజ‌యాన్ని అందుకున్నారక్కడ. ఈ చిత్రం తెలుగు హ‌క్కుల‌ను మ‌ల్కాపురం శివ‌కుమార్ సొంతం  చేసుకున్నారు. ప్ర‌స్తుతం అనువాద కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. జూన్‌లో సినిమాను విడుద‌ల చేసేలా స‌న్నాహాలు చేస్తున్నారు.

రాశీఖ‌న్నా హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాను వెంక‌ట్ మోహ‌న్ డైరెక్ట్ చేశారు. సామ్ సి.ఎస్ సంగీతం అందించారు. హీరో విశాల్ న‌ట‌నే సినిమాకు హైలైట్‌గా నిల‌ిచిందని త‌మిళ ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కులు చిత్రాన్ని అప్రిషియేట్ చేశారు. తెలుగులో వచ్చిన టెంపర్ సినిమాకు రీమేక్ ఇది.