రేపట్నుంచి 'అభిమన్యుడు' ఆడియో రిలీజ్

Wednesday,March 07,2018 - 10:59 by Z_CLU

మాస్‌ హీరో విశాల్‌, సమంత హీరోహీరోయిన్లుగా, పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘అభిమన్యుడు’. ఈ చిత్రం తెలుగు రైట్స్‌ను హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ అధినేత జి.హరి ఫ్యాన్సీ ఆఫర్‌తో దక్కించుకున్నారు. ఎం.పురుషోత్తమన్‌ సమర్పణలో తెలుగులో విడుదల చేయనున్నారు. ‘తొలి తొలిగా తొలకరి’ అంటూ సాగే ఈ చిత్రంలోని మొదటి పాటను యూత్‌ స్టార్‌ నితిన్‌ చేతులమీదుగా రేపు (మార్చి 8న) విడుదల చేస్తున్నారు. అక్కడ్నుంచి దశలవారీగా అన్ని పాటలు రిలీజ్ అవుతాయి.

ఈ సందర్భంగా హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ అధినేత జి.హరి మాట్లాడుతూ ”ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. మార్చి 8న ఈ చిత్రంలోని మొదటి పాటను హీరో నితిన్‌ విడుదల చేయనున్నారు. విశాల్‌ కెరీర్‌లోనే హయ్యస్ట్‌ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ఇది. హై టెక్నికల్‌ వాల్యూస్‌తో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం వస్తోంది. యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు” అన్నారు.