త్వరలో 'అభిమన్యుడు' సీక్వెల్

Sunday,June 10,2018 - 03:30 by Z_CLU

విశాల్ ‘అభిమన్యుడు’ సూపర్ హిట్టయింది. సైబర్ క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ అటు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోను సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హీరో విశాల్, త్వరలో ఈ సినిమా సీక్వెల్ ఉండబోతుందని కన్ఫం చేశాడు.

‘అభిమన్యుడు’ సినిమా  క్లైమాక్స్ లో ఈ సినిమాలో విలన్ గా నటించిన అర్జున్, ఇంకో ప్రాజెక్ట్ పై  ఫోకస్ చేయబోతున్నట్టు క్లోజ్ చేసిన ఫిలిమ్  మేకర్స్, ఈ సినిమా  సీక్వెల్ ని దాన్ని చుట్టూ ప్లాన్ చేయబోతున్నామని చెప్పాడు. త్వరలో ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ బిగిన్ చేయనున్న అభిమన్యుడు టీమ్, త్వరలో ఈ సినిమా కంప్లీట్ డీటేల్స్ ని అనౌన్స్ చేయనున్నారు.

ఈ సంవత్సరం ‘పందెం కోడి 2’ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్న విశాల్, తను చేసే ప్రతి సినిమా అందరినీ మెస్మరైజ్ చేసేదిగా ఉండేలా ప్లాన్ చేసుకుంటానని  చెప్పుకున్న  ఈ హీరో, మరి అభిమన్యుడు 2 లోను అదే టీమ ని రిపీట్ చేస్తాడా..? లేకపోతే ఏమైనా చేంజెస్ జరుగుతాయా అనేది ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే కానీ తెలీదు.