డిసెంబర్‌ 23న విశాల్‌ 'ఒక్కడొచ్చాడు'

Friday,December 16,2016 - 01:00 by Z_CLU

మాస్‌ హీరో విశాల్‌, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో తెరకెక్కిన ఒక్కడొచ్చాడు సినిమా ఇప్పటికే ఓసారి వాయిదాపడింది. డీమానిటైజేషన్ వల్ల రిలీజ్ పోస్ట్ పోన్ అయిన ఈ సినిమాకు తాజాగా మరో విడుదల తేదీ ఫిక్స్ చేశారు. డిసెంబర్ 23న ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. జగపతిబాబు విలన్ గా నటించిన ఈ సినిమాకు తమన్న అందాలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవబోతున్నాయి. ఇప్పటికే విడుదలైన మేకింగ్ వీడియోలు, నెట్ లో వైరల్ కాగా.. తాజాగా విడుదలైన స్టిల్స్ కూడా సినిమాపై అంచనాలు పెంచాయి.

vishal-tamanna_okkadochadu-movie-2

ఒక్కడొచ్చాడు సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఐదేళ్ల గ్యాప్ తర్వాత ఈ సినిమాతో కమెడియన్ వడివేలు మరోసారి తెరపైకి వస్తున్నాడు. హిపాప్ తమీజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో చివరి 30నిమిషాలు సంథింగ్ స్పెషల్ ఉంటుందని చెబుతున్నారు.