ఎన్టీఆర్ సినిమాను స్టార్ట్ చేసిన విశాల్

Saturday,August 25,2018 - 12:54 by Z_CLU

టెంపర్… ఎన్టీఆర్ కెరీర్ ను మలుపుతిప్పిన సినిమా. ఈ సినిమా తర్వాతే ఎన్టీఆర్ క్రేజ్, మార్కెట్ అమాంతం పెరిగాయి. ఈ సినిమా ప్రస్తుతం హిందీలో రీమేక్ అవుతోంది. ఇప్పుడు తమిళ రీమేక్ కూడా సెట్స్ పైకి వచ్చింది. టెంపర్ తమిళ రీమేక్ ను హీరో విశాల్ స్టార్ట్ చేశాడు.

ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో పందెంకోడి-2తో బిజీగా ఉన్న విశాల్… ఇప్పుడు టెంపర్ చిత్రాన్ని మొదలుపెట్టాడు. రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మురగదాస్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకట్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో తమిళ నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేసినట్లు సమాచారం.