విశాల్ సినిమాకు లైన్ క్లియర్

Tuesday,July 10,2018 - 12:08 by Z_CLU

ఇటివలే ‘అభిమన్యుడు’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విశాల్ ప్రస్తుతం లింగు స్వామి డైరెక్షన్ లో ‘సండకోలి2’ సినిమా చేస్తున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో ‘సండకోలి’ తో సూపర్ హిట్ కొట్టిన ఈ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ ను సోషల్ మీడియా ద్వారా  ప్రకటించాడు విశాల్.. తమిళ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుండి రిలీజ్ కు లైన్ క్లియరెన్స్ లెటర్ వచ్చిందని తమిళ్, తెలుగు భాషల్లో ఒకే సారి అక్టోబర్ 18 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు తెలిపాడు.

ఈ సినిమా తెలుగులో ‘పందెం కోడి2’ టైటిల్ తో విడుదల కానుంది. విశాల్ సరసన కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.