విశాల్ పందెంకోడి 2 ట్రైలర్ రిలీజ్ కి రెడీ

Thursday,September 27,2018 - 04:43 by Z_CLU

రీసెంట్ గా రిలీజైన ‘పందెం కోడి2’ టీజర్ సినిమాపై మరింత బజ్ ని పెంచేసింది. విశాల్ కరియర్ లోనే వెరీ స్పెషల్ మూవీ అనిపించుకున్న పందెంకోడి కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లోను అంచనాలున్నాయి. అయితే ఇదే స్పీడ్ లో ఈ సినిమా ట్రైలర్ ని సెప్టెంబర్ 29 న రిలీజ్ చేద్దామని ఫిక్సయ్యారు ఫిలిమ్ మేకర్స్.

విశాల్ కరియర్ లో ఇది 25 వ సినిమా కావడంతో ఫిలిమ్ మేకర్స్ ఫ్యాన్స్ అంచనాలకు ధీటుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మేకింగ్ వ్యాల్యూస్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో టీజర్ చూస్తేనే తెలిసిపోయింది. అయితే ఇప్పుడు రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ ట్రైలర్ లో, సినిమాకి సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ని చేయనున్నట్లు తెలుస్తుంది.

ఈ సినిమాలో విశాల్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. లైకా ప్రొడక్షన్స్, విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, పెన్ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి లింగుస్వామి డైరెక్టర్. ఈ సినిమా అక్టోబర్ 18 న వరల్డ్ వైడ్ గా రిలీజవుతుంది.