పులి మేక కలిసి ఆడే ఆట – విశాల్ పందెంకోడి 2

Friday,August 31,2018 - 04:48 by Z_CLU

విశాల్ ‘పందెంకోడి 2’ టీజర్ రిలీజయింది. విశాల్ కరియర్ లో ఇది 25 వ సినిమా కావడంతో న్యాచురల్ గానే సినిమాపై భారీ అంచనాలున్నాయి. 1:08 సెకన్ల ఈ టీజర్ సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేస్తుంది.

టీజర్ లో  ఏ మాత్రం స్టోరీ రివీల్ చేయకుండానే మ్యానేజ్ చేసింది పందెం కోడి 2 టీమ్. ట్రైలర్ లో కనిపిస్తున్న ప్రతి షాట్ , సినిమాకి పెట్టిన బడ్జెట్ ని ఎలివేట్ చేస్తుంది. కంప్లీట్ మాస్ ఎలిమెంట్స్ తో ఉన్న యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు, విశాల్ కీర్తి సురేష్ ల కెమిస్ట్రీ, సినిమాపై ఇంట్రెస్ట్ ని జెనెరేట్ చేస్తుంది.

మరీ ముఖ్యంగా  టీజర్ చివరన  ‘ఇది పులి మేక ఆడే ఆట కాదు, పులి మేక కలిసి ఆడే ఆట’ అనే డైలాగ్, ఫ్యాన్స్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది.

లైకా ప్రొడక్షన్స్, విశాల్ ఫిలిమ్ ఫ్యాక్టరీ, పెన్ స్టూడియోస్, లైట్ హౌజ్ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజ్ చేశాడు. అక్టోబర్ 18 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజవుతుంది.