విశాల్ ‘పందెంకోడి 2’ టీజర్ రిలీజ్ డేట్

Monday,August 27,2018 - 05:44 by Z_CLU

విశాల్ ‘పందెం కోడి 2’ ప్రీ లుక్ రిలీజ్ అయింది. ఈ ప్రీ లుక్ లో సినిమా ఫస్ట్ లుక్ తో పాటు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు ఫిల్మ్ మేకర్స్. ఆగష్టు 29 మార్నింగ్ 11 గంటలకు ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ ని రిలీజ్ చేయనున్నారు పందెంకోడి 2 టీమ్.

విశాల్ కరియర్ లో బెస్ట్ ప్లేస్ ని ఆక్యుపై చేసుకున్న ‘పందెంకోడి’ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దానికి తోడు విశాల్ కరియర్ లో ఇది 25 వ సినిమా కావడంతో, భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా విశాల్ కరియర్ లో మరో మైల్ స్టోన్ మూవీ అనిపించుకోవడం గ్యారంటీ అని ఫిక్సయి ఉన్నారు ఫ్యాన్స్.

విశాల్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి లింగుస్వామి డైరెక్టర్. లైకా ప్రొడక్షన్స్, విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, పెన్ స్టూడియోస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.