సంక్రాంతి బరిలో విశాల్ సినిమా

Thursday,November 16,2017 - 05:29 by Z_CLU

రీసెంట్ గా డిటెక్టివ్ సినిమాతో ఇంప్రెస్ చేసిన విశాల్, తన నెక్స్ట్ మూవీ ‘అభిమన్యుడు’ తో సంక్రాతి బరిలోకి దిగనున్నాడు. అల్టిమేట్  లావిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. అయితే ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 13 న రిలీజ్ చేయనున్నారు ఫిల్మ్ మేకర్స్. అయితే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ తో పాటు, మోషన్ పోస్టర్ ని ఈ నెల 18 న రిలీజ్ చేయనుంది అభిమన్యుడు.

డిసెంబర్ 27 న ఆడియో రిలీజ్ కానున్న ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజర్. విశాల్ సరసన సమంతా హీరోయిన్ గా నటించింది. విశాల్ కరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి P.S. మిత్రన్ డైరెక్టర్. ఈ సినిమాని తెలుగులో వెంకటేశ్వర పిక్చర్స్ బ్యానర్ పై హరి గుజ్జలపూడి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.