హైదరాబాదీ అమ్మాయితో విశాల్ పెళ్లి
Wednesday,January 16,2019 - 12:37 by Z_CLU
హీరో విశాల్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హైదరాబాద్ కు చెందిన అనీషా రెడ్డిని త్వరలోనే పెళ్లాడబోతున్నాడు ఈ హీరో. ఈ మేరకు రెండు కుటుంబాలు వీళ్ల పెళ్లికి అంగీకరించాయి
విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడనే విషయాన్ని అతడి తండ్రి జీకే రెడ్డి ఇప్పటికే కన్ ఫర్మ్ చేశాడు. విశాల్ కూడా ఈ విషయాన్ని ఓకే చేశాడు. తాజాగా ఆ అమ్మాయి డీటెయిల్స్ బయటకొచ్చాయి. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి లాంటి సినిమాల్లో అనీషా రెడ్డి చిన్నచిన్న పాత్రలు కూడా చేసింది.
చెన్నైలో నడిగర్ సంఘం బిల్డింగ్ కట్టిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని గతంలో ప్రకటించాడు విశాల్. చెప్పినట్టుగానే నడిగర్ సంఘం బిల్డింగ్ ను ఫినిషింగ్ స్టేజ్ కు తీసుకొచ్చాడు. అదే బిల్డింగ్ లో అనీషాను పెళ్లి చేసుకోబోతున్నాడు.
