విశాల్ ఇంటర్వ్యూ

Monday,November 06,2017 - 12:26 by Z_CLU

విశాల్ హీరోగా నటించిన ‘డిటెక్టివ్’ నవంబర్ 10 న రిలీజ్ అవుతుంది. తమిళంలో ‘తుప్పరివాలన్’ టైటిల్ తో రిలీజై,  సూపర్ హిట్టయిన ఈ సినిమా తెలుగులోనూ అదే రేంజ్ లో హిట్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు విశాల్. ఈ సందర్భంగా మీడియాతో ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు.

 

అదే ఈ సినిమాలో స్పెషల్

సినిమా మొత్తం ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ లో పోలీసులు కూడా సాల్వ్ చేయని ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ను నేను సాల్వ్ చేస్తుంటారు. ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇదే

రెగ్యులర్ సినిమా కాదు

మామూలుగా మనం సినిమా చూస్తుంటే మనకు కొన్ని సిచ్యువేషన్స్ ముందే తెలిసిపోతుంటాయి. ఇప్పుడు సాంగ్ ఉంటుంది, ఇక్కడ ఫైట్ గ్యారంటీ అని ఎస్టాబ్లిష్ అయిపోతుంది. కానీ ఈ సినిమా మాత్రం ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. ఆసక్తిగా ఒక నవల చదువుతున్నట్టు, థ్రిల్లింగ్ గా ఉంటుంది.

 

అందుకే లేటైంది

సినిమా రెడీ అయ్యాక సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకోవడం ఒక ఎత్తైతే, రెండు లాంగ్వేజెస్ లోను స్టార్ హీరోస్ సినిమాల రిలీజ్ లేకుండా చూసుకోవడం మరో ఎత్తు, ఈ ప్రాసెస్ లో 2 భాషల్లో సినిమాను ఒకేసారి రిలీజ్ చేయలేకపోయాం.

 

డెడికేటెడ్ గా చేశారు…

సినిమాలో అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్ గా నటించింది. ఆండ్రియా ఇంటెన్సివ్ విలన్ రోల్ లో కనిపిస్తుంది. ఇద్దరూ సినిమాలో చాలా బాగా నటించారు. చాలా డెడికేషన్ తో చేశారు. అది స్క్రీన్ పై కనిపిస్తుంది.

 

నిజంగా అదృష్టం…

మోహన్ లాల్ గారితో విలన్ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడమే లక్, అందునా నన్ను విలన్ గా చూపించే పాత్ర దొరకడం ఇంకా అదృష్టం. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు నా పెర్ఫామెన్స్ చూసి  మెచ్చుకుంటున్నారు. కానీ, మోహన్ లాల్ గారితో నటించేటప్పుడు చాలా భయపడ్డాను. కానీ బయటపడలేదు.

 

చాలా నేర్చుకున్నాను…

మోహన్ లాల్ గారికి ఒక క్లోజ్ షాట్ సెట్ చేస్తే డైలాగ్ కూడా లేకుండా, కేవలం కళ్లతో సీన్ పండించేయగలరు. అంత కెపాసిటీ ఉన్న నటుడాయన. అయనతో కలిసి పనిచేసే ప్రాసెస్ లో చాలా నేర్చుకున్నాను. మరీ ముఖ్యంగా కళ్లతోనే సీన్ ను పండించడం ఎలాగో తెలుసుకున్నాను.

 

తెలుగులో సినిమా చేస్తాను

తెలుగులో సినిమా తప్పకుండా చేస్తాను. ఈ సినిమా చేస్తే మంచి పేరు వస్తుంది అనే రేంజ్ స్క్రిప్ట్ దొరికిన రోజు తప్పకుండా తెలుగు సినిమా చేస్తాను…