షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డ విశాల్

Thursday,March 28,2019 - 12:48 by Z_CLU

హీరో విశాల్ షూటింగ్ లో గాయపడ్డాడు. అతడి చేతికి, గాలికి దెబ్బలు తగిలాయి. టర్కీలో ఈ ఇన్సిడెంట్ జరిగింది.

సుందర్ సి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విశాల్. టర్కీలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. షూట్ లో భాగంగా బైక్ పై ఛేజింగ్ సీన్ చేస్తుండగా విశాల్ జారిపడ్డాడు. వెంటనే అతడ్ని దగ్గర్లోని హాస్పిటల్ లో జాయిన్ చేశారు.

విశాల్ కు వెంటనే ట్రీట్ మెంట్ అందించిన వైద్యులు, అతడ్ని వారం రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోమని సూచించాడు. కాలు, చేతికి కట్లుతో విశాల్ కుర్చీలో కూర్చున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.