నేను ఆరోగ్యంగా ఉన్నాను – విశాల్

Tuesday,February 27,2018 - 03:16 by Z_CLU

సోషల్ మీడియాలో విశాల్ ఆరోగ్య పరిస్థితి బాలేదని హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడని వస్తున్న రూమర్స్ పై స్పందించాడు విశాల్. ‘ఇరుంబు తురై’ సినిమా షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డ విశాల్ చికిత్స కోసం U.S. కి వెళ్తున్నాడన్న న్యూస్ కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను చక్కర్లు కొట్టింది. అలాంటిదేమీ లేదని తను ఆరోగ్యంగా ఉన్నానని ట్వీట్ చేసి కన్ఫం చేశాడు విశాల్.

‘ఇరుంబు తురై’ షూటింగ్ సమయంలో గాయపడినట్టు, చికిత్స కోసం U.S. కి తీసుకు వెళ్తున్నారని వస్తున్న వార్తల్లో  ఏ మాత్రం నిజం లేదని, కేవలం మైగ్రేన్ వల్ల కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటున్నానని క్లారిటీ ఇచ్చిన విశాల్, మార్చి 1 నుండి మళ్ళీ యధావిధిగా షూటింగ్ లో పాల్గొంటున్నానని కన్ఫం చేశాడు. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘ఇరుంబు తురై’ సినిమాలో విశాల్ సరసన సమంతా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో పాటు లింగుస్వామి డైరెక్షన్ లో నటిస్తున్న విశాల్, ప్రభుదేవా సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఉంది.