విశాల్ "చక్ర" ట్రయిలర్ రివ్యూ

Saturday,June 27,2020 - 07:10 by Z_CLU

ఇప్పటికే ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఆఫ్ ట్రయిలర్ రిలీజ్ చేసిన విశాల్.. తన అప్ కమింగ్ మూవీ చక్రకు సంబంధించి ఈరోజు ట్రయిలర్ రిలీజ్ చేశాడు. సైబర్ మోసాల కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కించారనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతుంది.

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ ఫుల్ గా ఉన్నాయనే విషయం ట్రయిలర్ చూస్తేనే అర్థమౌతుంది. ఓ వ్యక్తి చేసే సైబర్ మోసాల్ని, మిలట్రీకి చెందిన ఓ వ్యక్తి ఎలా ఎదుర్కొన్నాడు.. ఆన్ లైన్ ఫ్రాడ్స్ నుంచి ప్రజల్ని ఎలా కాపాడాడనేది ఈ సినిమా స్టోరీ.

సినిమాలో విశాల్ సరసన శ్రద్ధాశ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. ట్రయిలర్ లో ఆమె పాత్రను కూడా రివీల్ చేశారు. చక్రలో శ్రద్ధా శ్రీనాధ్ పోలీస్ గా నటించింది.

విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై విశాల్ నిర్మించిన ఈ సినిమాను ఆనందన్ డైరక్ట్ చేశాడు