Vishal Chakra - ఫిబ్రవరి 19 రిలీజ్

Tuesday,February 02,2021 - 11:32 by Z_CLU

యాక్ష‌న్ హీరో విశాల్ హీరోగా ఆనందన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం `చ‌క్ర‌`. శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఒక కీల‌క‌పాత్ర‌లో హీరోయిన్‌ రెజీనా న‌టిస్తోంది. తన సొంత బ్యానర్ పై విశాల్ నిర్మించిన ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది.

ఫిబ్రవరి 19న సౌత్ లోని అన్ని భాషల్లో చక్ర సినిమాను విడుదల చేయబోతున్నట్టు విశాల్ ప్రకటించాడు.

నిజానికి ఈ సినిమాను లాక్ డౌన్ టైమ్ లోనే రిలీజ్ చేయాలనుకున్నారు. ఒక ఓటీటీ సంస్థతో చర్చలు కూడా జరిపారు. డీల్ సెట్ అయితే నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాడు విశాల్. కానీ ఆ డిస్కషన్స్ వర్కవుట్ కాలేదు. అంతలోనే లాక్ డౌన్ ఎత్తేయడంతో, ఇలా థియేటర్లలోకి వస్తోంది చక్ర.

ఇది హీరో విశాల్, మ్యూజిక్ డైరెక్ట‌ర్ యువ‌న్ శంక‌ర్‌రాజా కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న10వ చిత్రం. ఇప్పటికే విడుద‌ల చేసిన ట్రైల‌ర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న డిజిటల్ క్రైమ్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది ఈ సినిమా.