Enemy - మరో క్రేజీ మల్టీస్టారర్

Monday,November 30,2020 - 08:00 by Z_CLU

Vishal_Arya_Enemy: గతంలో దర్శకుడు బాల తీసిన `వాడు-వీడు` సినిమాలో తమిళ స్టార్ హీరోలు విశాల్, ఆర్య కలిసి నటించి బాక్సాఫీస్‌ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా అప్పట్లో ఓ హాట్ టాపిక్. వీరిద్ద‌రు పక్కా పల్లెటూరి మొరటోళ్లుగా నటించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు.

ఇప్పుడు మరోసారి Vishal-Arya కలిసి మ‌రో బిగ్ మూవీ చేస్తున్నారు. రీసెంట్ గా రామోజీ ఫిలిం సిటీలో ఈ మూవీ లాంఛనంగా ప్రారంభమైంది. ప్ర‌స్తుతం రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ చిత్రానికి ఎనిమీ (Enemy) అనే పేరును ఫిక్స్ చేశారు.

Vishal_Arya_Enemy_Movie_Zeecinemalu_ఎనిమి

ఇది యాక్ష‌న్ హీరో విశాల్ కు 30వ చిత్రం కాగా, ఆర్య‌కు 32వ సినిమా. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ ప‌తాకంపై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు .ఈ
చిత్రంలో విల‌క్షణ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన మృణాళిని ర‌వి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రానికి ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ ఆర్ ‌డి రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తుండగా.. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

తెలుగు, తమిళంలో పాటు మరికొన్ని భాషల్లో ఈ చిత్రాన్ని ఒకేసారి రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఆనంద్ శంక‌ర్‌ ఈ సినిమాకు దర్శకుడు. గతంలో విజయ్ దేవరకొండ హీరోగా నోటా సినిమాను తీసింది ఇతడే.