విశాల్ ‘అభిమన్యుడు’ రిలీజ్ డేట్ ఫిక్సయింది

Monday,May 21,2018 - 07:21 by Z_CLU

విశాల్ ‘అభిమన్యుడు’ రిలీజ్ డేట్ ఫిక్సయింది. సైబర్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే తమిళనాట సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఓ వైపు కోలీవుడ్ లో సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూనే, మరో వైపు ఈ సినిమాను  టాలీవుడ్ లో రిలీజ్ చేసే ప్రాసెస్ లో ఉన్న ఫిల్మ్ మేకర్స్, జూన్ 1 న ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

రీసెంట్ గా U/A సర్టిఫికెట్ తో సెన్సార్ క్లియరెన్స్ పొందిన ఈ సినిమాలో విశాల్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మెస్మరైజ్ చేస్తున్న సమంతా, ఈ సినిమాలో విశాల్ సరసన స్పెషల్ ఎట్రాక్షన్ ల నిలవనుంది. యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా నటించిన ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలెట్ కానున్నట్టు తెలుస్తుంది.

 

యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా P.S. మిత్రన్ డైరెక్షన్ లో తెరకెక్కింది. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా, టాలీవుడ్ లో ఏ స్థాయిలో ఇంప్రెస్ చేయనుందో మరికొన్ని రోజుల్లో తెలిసిపోతుంది.