ఫ్రైడే రిలీజెస్

Wednesday,May 30,2018 - 03:15 by Z_CLU

లాస్ట్ వీక్ రిలీజైన అమ్మమ్మగారిల్లు, నేల టిక్కెట్టు ఆడియెన్స్ ని ఇంప్రెస్ చేసే పనిలో ఉన్నాయి. అంతలో ఈ ఫ్రైడే  మరో 3 సినిమాలు రెడీ టు రిలీజ్ మోడ్ లో ఉన్నాయి. ఆ సినిమాల వివరాలివే…

 

అభిమన్యుడు : తమిళంలో రిలీజై బ్లాక్ బస్టర్ అయిన విశాల్  ‘అభిమన్యుడు’ చుట్టూ టాలీవుడ్ లో అదే రేంజ్ క్రేజ్ క్రియేట్ అయి ఉంది. ఇంటెన్సివ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కీ రోల్ ప్లే చేశాడు.  P.S. మిత్రన్ ఈ సినిమాకు డైరెక్టర్.

ఆఫీసర్ : RGV డైరెక్షన్ లో లో తెరకెక్కిన మోస్ట్ ఇంటెన్సివ్ యాక్షన్ థ్రిల్లర్ ఈ సినిమా. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా సాంగ్స్ తో పాటు, సినిమాలో BGM ని హైలెట్ చేస్తూ రిలీజైన వీడియోస్ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి.

 

రాజుగాడు : రాజ్ తరుణ్, అమైరా దస్తూర్ జంటగా నటించిన ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ రాజుగాడు. ఈ సినిమాతో సంజనా రెడ్డి డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతుంది. ఈ సినిమాలో రాజ్ తరుణ్ క్లెప్టోమేనియా అనే డిసీజ్ ఉన్న కుర్రాడిలా కనిపించనున్నాడు.