'అభిమన్యుడు' జ్యూక్ బాక్స్ రివ్యూ

Saturday,May 26,2018 - 10:03 by Z_CLU

విశాల్ అభిమన్యుడు జూన్ 1 న గ్రాండ్ గా రిలీజవుతుంది. సైబర్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయింది. ఈ సినిమా తెలుగులోనూ అదే రేంజ్ హిట్టవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్న ఫిల్మ్ మేకర్స్ నిన్న ఈ సాంగ్స్ రిలీజ్ చేశారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ 5 సాంగ్స్ సినిమాలో సందర్భోచితంగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.

 

హే రెడీ : జ్యూక్ బాక్స్ లోని ఫస్ట్ సాంగ్. లిరిక్స్ ని బట్టి ఈ సాంగ్ సినిమాలో హీరో డేరింగ్ ఆటిట్యూడ్ ని ఎలివేట్ చేస్తుంది. కృష్ణకాంత్ లిరిక్స్ రాసిన ఈ పాటని నవీన్ పాడాడు.

 

తొలి తొలిగా తొలకరి : ఈ సాంగ్ సినిమాలో ముఖ్యంగా హీరోలోని సాఫ్ట్ సైడ్ ని ఎలివేట్ చేస్తుంది. ఆంగ్రీ యంగ్ మ్యాన్ లా హీరో సడెన్ గా, మనుషుల్ని నేచర్ ని గమనించడం మొదలుపెట్టే సందర్భంలో ఉండే సాంగ్ అని తెలుస్తుంది. శ్రేష్ఠ లిరిక్స్ రాసిన ఈ పాటను జితిన్ రాజ్ పాడాడు.

 

ఆంగ్రీ బర్డ్ : ‘ఆంగ్రీ బర్డ్ లాంటి నన్ను తను లవ్ బర్డ్ చేసే లేరా…’ అనే లిరిక్ ని బట్టి హీరో, తన లవ్ ఇంట్రెస్ట్ ని తలుచుకుంటూ ఫీలయ్యే సాంగ్ అని తెలుస్తుంది. జితిన్ రాజ్ పాడిన ఈ సాంగ్ కి శ్రేష్ఠ లిరిక్స్ రాసింది.

ఎవ్వరో : అభిమన్యుడు సినిమాలో హైలెటెడ్ పాయింట్ సైబర్ క్రైమ్. సినిమాలో బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ఉండబోయే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాలో కీ రోల్ ప్లే చేసిన అర్జున్ చుటూ ఉంటాయని తెలుస్తుంది. అయితే ఈ సాంగ్ అర్జున్ క్యారెక్టరైజేషన్ ని అది క్రియేట్ చేసే ఇంపాక్ట్ ని ఎలివేట్ చేస్తుంది. కృష్ణకాంత్ రాసిన  ఈ పాటని దీపక్ పాడాడు.

అడిగే : సినిమాలో విశాల్, సమంతా కాంబినేషన్ లో ఉండబోయే రొమాంటిక్ సాంగ్. స్లో పేజ్ లో మోస్ట్ మెలోడియస్ గా కంపోజ్ అయిన ఈ సాంగ్ ని దీపక్, శ్రీవర్దని కలిసి పాడారు. శ్రేష్ఠ లిరిక్స్ రాసింది.