Vishal Enemy - రెడీ ఫర్ రిలీజ్
Sunday,July 18,2021 - 12:03 by Z_CLU
యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్య కలిసి నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఎనిమీ’. 10 సంవత్సరాల క్రితం దర్శకుడు బాల తెరకెక్కించిన ‘వాడు–వీడు’ సినిమా తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తోన్న చిత్రమిది. ఇది హీరో విశాల్ 30వ చిత్రం కాగా, ఆర్యకు 32వ మూవీ.
‘గద్దల కొండ గణేష్’ ఫేమ్ మృణాళిని రవి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ ఒక కీలక పాత్రలో నటించారు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ‘ఎనిమీ’ షూటింగ్ పూర్తయిందని హీరో విశాల్ తెలిపారు.
విశాల్ మాట్లాడుతూ.. ‘‘ఎనిమీ’ చిత్రీకరణను విజయవంతగా పూర్తి చేశాం. టీజర్ విడుదలకు అంతా సిద్ధమైంది. ఇటువంటి లవ్లీ టీమ్‌తో వర్క్ చేసినందుకు సంతోషంగా ఉంది. ఆర్యతో కలిసి మళ్లీ వర్క్ చేసినందుకు ఆనందంగా ఉంది. ఇంత మంచి ప్రాజెక్ట్‌లో భాగమైన దర్శకుడు ఆనంద్‌శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, కెమెరామ్యాన్ ఆర్‌డి రాజశేఖర్, నిర్మాత వినోద్ కుమార్‌లతో పాటు చిత్రయూనిట్ అందరికీ ధన్యవాదలు’’.
ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆర్ డి రాజశేఖర్ ఛాయాగ్రహణం అందిస్తుండగా, లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళంలో పాటు మరికొన్ని భాషలలో ఈ చిత్రం విడుదలకానుంది.

దర్శకత్వం: ఆనంద్ శంకర్
నిర్మాత: వినోద్ కుమార్
సంగీతం: తమన్ ఎస్ ఎస్
సినిమాటోగ్రఫీ: డి రాజశేఖర్,
ఆర్ట్: టి. రామలింగం
ఎడిటర్: రేమండ్ డెరిక్ క్రాస్టా
యాక్షన్: రవివర్మ
- – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics