విరుష్క రిసెప్షన్ పార్టీ రెడీ

Tuesday,December 19,2017 - 11:01 by Z_CLU

ప్రస్తుతం హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు అనుష్క శర్మ, విరాట్ కోహ్లి. ఈ హనీమూన్ తర్వాత ఇండియాలో భారీ రిసెప్షన్ ఏర్పాటుచేసింది ఈ జంట. అది కూడా 2 రిసెప్షన్లు ఏర్పాటుచేయడం విశేషం. ఢిల్లీ, ముంబయిలో రిసెప్షన్లు ఏర్పాటుచేసింది విరుష్క జంట.

ఈనెల 21న ఢిల్లీలో, 26న ముంబయిలో ఈ రిసెప్షన్లు ఉంటాయి. 21న ఢిల్లీలో తాజ్ డిప్లమాటిక్ ఎన్ క్లేవ్ లోని దర్బార్ హాల్ లో అనుష్క శర్మ, విరాట్ కోహ్లి వెడ్డింగ్ రిసెప్షన్ జరుగుతుంది. ఇక 26న రిసెప్షన్ కోసం ముంబయిలోని లోవర్ పెర్ల్ లోని యాస్టర్ బాల్ రూమ్ వేదిక కానుంది.

రెండు రిసెప్షన్లకు సంబంధించి ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందాయి. ఆ ఆహ్వాన పత్రిక స్టిల్స్ కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఇండియాకు వచ్చిన వెంటనే ముంబయిలోని ఓ ఖరీదైన ఫ్లాట్ కు మారబోతోంది ఈ జంట. ఈ ఫ్లాట్ ఖరీదు అచ్చంగా 32 కోట్ల రూపాయలు. ఆ స్టిల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.