పరకాల బస్టాండ్ లో సాయిపల్లవి

Saturday,September 07,2019 - 11:15 by Z_CLU

మొదట్నుంచి సహజత్వానికి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు విరాటపర్వం మేకర్స్. తెలంగాణలోని నేచురల్ లొకేషన్స్ లో ఈ సినిమాను షూట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మరో ప్రయోగాన్ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశారు. వరంగల్ జిల్లా పరకాల బస్టాండ్ లో హీరోయిన్ సాయిపల్లవిపై రియలిస్టిక్ గా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు.

పరకాల బస్టాండ్ లో సాయిపల్లవి, ఆర్టీసీ బస్సు కోసం ఎదురుచూసే సన్నివేశాల్ని చిత్రీకరించారు. సాధారణమైన తెలంగాణ అమ్మాయి గెటప్ లో సాయిపల్లవి ఉండడంతో బస్టాండ్ లో ఎవరూ ఆమెను గుర్తించలేకపోయారు. మరీ ముఖ్యంగా షూటింగ్ జరుగుతున్న విషయం తెలియకుండా ఉండేందుకు దగ్గర్లోని లాడ్జ్ పై నుంచి ఈ సన్నివేశాల్ని చిత్రీకరించారు.

ప్రజలు హీరోయిన్ ను గుర్తించేలోపే అక్కడ్నుంచి వెళ్లిపోయింది సాయిపల్లవి. ఇలా అత్యంత సహజమైన పరిస్థితులు, లొకేషన్ల మధ్య విరాటపర్వం సినిమాను తెరకెక్కిస్తున్నారు. రానా హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు వేణు ఉడుగుల దర్శకుడు.