విరాటపర్వం షూటింగ్ అప్ డేట్స్

Monday,July 01,2019 - 12:01 by Z_CLU

రానా, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న మూవీ విరాటపర్వం. వేణు ఉడుగుల దర్శకత్వంలో మోస్ట్ ఎమోషనల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. తెలంగాణలోని ఓ మారుమూల పల్లెలో ఈ సినిమాకు సంబంధించి కొన్ని షాట్స్ తీశారు.

త్వరలోనే విరాటపర్వం సెకెండ్ షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. నీది నాది ఒకే కథ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వేణు ఉడుగుల, తన రెండో సినిమాను కూడా అంతే ఎమోషనల్ గా ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు.

80ల్లో తెలంగాణలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనలకు ఫిక్షన్ ను జోడించి ఈ కథను రాసుకున్న వేణు.. సెట్స్ వేయకుండా, రియలిస్టిక్ లొకేషన్లలో ఈ సినిమాను తీయాలని నిర్ణయించాడు. లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సినిమాతో టబు మరోసారి సిల్వర్ స్క్రీన్ పైకి వస్తోంది.

సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు. నీది నాది ఒకే కథ సినిమాకు వర్క్ చేసిన టెక్నీషియన్స్ లో చాలామంది ఈ విరాటపర్వంకు కూడా పనిచేస్తున్నారు.