టీజర్ తో ఎట్రాక్ట్ చేయబోతున్న ధనుష్

Monday,June 05,2017 - 04:00 by Z_CLU

అప్పట్లో ధనుష్ నటించిన ‘వి.ఐ.పి’ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. తమిళ్ తో పాటు తెలుగులో ‘రఘువరన్’ టైటిల్ తో రిలీజ్ అయిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి వసూళ్లనే రాబట్టింది.అందుకే ఇప్పుడు ఈ సినిమా సిక్వెల్ ‘వి.ఐ.పి 2’ తో మరో సారి హంగామా చేయడానికి రెడీ అవుతున్నాడు ధనుష్.

ధనుష్ స్టోరీ-డైలాగ్స్ అందించిన ఈ సినిమాకు రజిని కుమార్తె సౌందర్య దర్శకురాలు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ధనుష్ సరసన బాలీవుడ్ బ్యూటీ కాజోల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి జూన్ 7న టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా జులై 28 న థియేటర్స్ లోకి రానుంది.