సాయి ధరమ్ తేజ్ - వినాయక్ మొదలెట్టేశారు

Friday,September 22,2017 - 01:23 by Z_CLU

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ -వినాయక్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా ఈరోజు నుంచే సెట్స్ పైకి వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదటి రోజు షూటింగ్ జరుపుకుంటుంది ఈ సినిమా.

ఇప్పటి వరకూ మినిమమ్ రేంజ్ ఉన్న దర్శకులతో మాత్రమే పనిచేసిన సాయి ధరమ్ తేజ్ మొదటి సారి గా వినాయక్ వంటి స్టార్ డైరెక్టర్ తో పనిచేస్తుండడం నమ్మలేకపోతున్నాను అంటూ మొదటి రోజు సెట్ లో  ఎగ్జైట్ మెంట్ ను  అభిమానులతో పంచుకున్నాడు.

సి.కె ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది. ఆకుల శివ కథను అందించిన ఈ సినిమాకు ‘దుర్గ’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు మేకర్స్.